ది పవర్ ఆఫ్ ..బుచ్చి..తింగిరి బుచ్చి.
ఈ తింగర బుచ్చి గురించి ఎలా మొదలు పెట్టాలో కూడ నాకు అర్ధంకావడం లేదు.అభాసుపాలవుతావు ఆపవే నీ తెలుగుఅంటే..."పాలా..ఏ కొట్లో దొరుకుతాయి" అని అదిగేటంత తింగిరిది.అది మన తెలుగమ్మాయి అని చెప్పుకోవడానికి నాకేసిగ్గుగా ఉంది.
నేను "అటు పై పిదప" అని రాశాననుకోండి..మా తింగిరిది "అట్టు పై దవడ" అని చదివిచస్తుంది.
సరే ఇలా కాదని "చూడు తింగిరి! నీకు ఎటూ తెలుగు రాదు అని నాకర్ధమైంది.ఇకపై నువ్వు తెలుగులోమాట్లాడాలనుకుంటే నీకు ఏ పదము రాదో అది ఇంగ్లిష్లో చెప్పెయ్.నాకీ తెగులు గోల తప్పుతుంది" అని అనీనకముందెసరే ఎప్పటినుండి talk చేయాలి " అని కూసిందండి ఆ గాడిదా.
అప్పుడే కొత్తగా వచ్చిన మా లెక్చరెర్, మా క్లాస్సందరినీ వాళ్ల మార్కుల పర్సంటేజ్ అడుగుతున్నారు.మా తింగిరిదితనకొచ్చిన 53% ని అందరిలో చెప్పుకోలేక..ఏం చెప్పాలి అని అందరిని అడిగింది.
"62 అని చెప్పెయ్యవే" అని ఒకరు.
"వద్దు వద్దు 67 అని చెప్పు బాగుంటుంది"..ఇంకొకరు
"అహె..ఎందుకే ఇంత డిస్కషన్ 63.2 అనో... 63.5 స్స్..బుస్స్..స్స్..ఏదో చెప్పెయ్" అని అన్నారు.
మా తింగిరి లేచి నిల్చొని..రెండు చేతులు కట్టుకొని..కళ్లు పత్తి గుడ్లంత చేసి.."మరండీ నాకు 63.5 బుస్స్ బుస్స్ స్స్..ఆ.. మర్చిపోయాను ఇంకో బుస్స్ కూడా వచ్చిందండి " అని చెప్పి వెనక్కి తిరిగి, చెప్పింది కరెక్టా కాదా అని కళ్లెగరేసింది.
అప్పటి వరకు నాలో తడిగుడ్డ వేసుకొని నిద్రపొతున్న భాషాభిమానం ఒక్కసారిగా రగ్గు విదిల్చి.."(అప్పటికే కిరణుమెడలొ హార్మోనియం పెట్టెతో రెడి అయిపొయింది."సొదరి కిరణు..శ్రుతి ఆరులో వేసుకో..")ఓయి... కమీ..నే!తెలుగుభాషకి తుప్పు పట్టిస్తున్న ఇద్దురాత్మురాలు..సిగ్గు లేని ఈ అడ్డగాడిదని..నేడేఅఆ..ఆఆఆ..బహిష్కరిం..పవలే..ఎఏ.ఎఏఏ.ఎఏ."
తింగిరిది పక్కమ్మాయ్ తల్లో ఉన్న రిబ్బన్ లాగి,నుదుటికి కట్టుకొని, బల్లెక్కి..."చైతు...!ఇప్పుడు నువ్వేం చేసావొతెలుసా..నిద్రపోతున్న సింహం లంగ లాగావె.ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది...నాకు కూడా ఒక రోజు వస్తుందే .." అనిఅక్కడినుండి వెళ్లిపోయింది.
అది చెప్పిన కుక్క సామెత నాకు అప్పటికి అర్ధం కాలేదు.
(ఇదిగో కెమెర మెన్ ..ఆ కెమెరాని తిరిగే ఆ బొంగరం వైపుకి తిప్పవయ్యా...)
అలా..చూస్తుండగానే కాలేజి రోజులు అయిపొయాయి..
***************************
అది 2010 మార్చి నెల. సమయము:రాహు కాలము ముహోర్తం:దుర్ముహూర్తం
నేను మల్లి ఈ చెన్నై అగ్నిగోళంలొ అడుగుపెట్టిన రోజు.ఎప్పుడూ లేని..ఎన్నడూ కనని మహాద్భుతాలు జరిగినరోజు. చెన్నై
చరిత్రలొ సువర్ణాక్షరాలతొ లిఖింప దగిన రోజు.ప్రపంచ చరిత్రలోనె..తొమ్మిదొవ వింత ( మొదటి ఏడు వింతలు ఎమిటొనన్ను అడక్కండి..నాకు తెలియదు.ఎనిమిదొ వింత మాత్రం మా తింగిరిదని. ఈ మద్యనే గిన్నిస్ బుక్కులోను,థంసప్బుక్కులోనూ...16 వ పర్వంలో.. 4 వ అధ్యాయంలో..2 వ శ్లోకంలో చెప్పబడినది).అది చెన్నైలొ చిరుజల్లులు కురిసినరోజు (ఆ పరిస్థితిని ఏమంటారో తెలియక జనాల్లొ పెద్ద అలజడి ట్రైన్లొ బయలుదేరింది.అక్కడి వాతావరణ కొమ్మ (శాఖ) ఓకమిటిని వేసి ఆ విపత్కర పరిస్థితిని ఏమంటరో తెలుసుకోవడానికి జుట్టు పీక్కుని,రాత్రింబవల్లు పరిశోధనలుచేయగా..అది "వర్షం" అని తేల్చారు.అప్పటికి ఆ చెన్నై ___ గాళ్లకు వర్షం అంటె ఏమిటొ కూడ తెలియదు).ఆ కొద్దిపాటివర్షానికి అందరూ..తెప్పల్లొ,పడవల్లొ ప్రయాణిస్తున్నారు.
మా తింగిరిది ఆ తెప్పలొ ఈదుకుంటూ..బ్యాక్ గ్రౌండ్లో."గాలి వానలొ వాన నీటిలో పడవ ప్రయాణం..తీరమెక్కడొదారిఏమిటొ.." అంటూ నన్ను పికప్ చేసుకొవడానికి ఎయిర్ పొర్ట్ కి వచ్చింది . తను నాదగ్గరికి వచ్చి,పాట కోసం ఓ ఏడుగజాల దూరం పరుగెత్తి.."నేనీదరిని నీవాదరిని చెన్నై కలిపింది ఇద్దరినీ"..అని పాడి,నా లగేజి అందుకుంది.
అప్పటికే నాకు బాగా ఆకలేస్తుండటంతొ.."ఏమే..ముందుగా ఆత్మారాముడిని శాంతపరచాలి పదా" అన్నాను.
వెంటనే తను.."అదెంటే.. మరి నువ్వు ఒక్కదానివే వస్తున్నట్టు చెప్పావు.ఇంతకి ఎవరా ఆత్మారాముడు..నాకు పరిచయంచెయ్యవు"అనేసరికి..నాకు భూమి గుండ్రంగా కనిపించింది.
నేను: "వెనక ఫ్లైటు కదలకపోతె తొయ్యడానికి వెళ్లాడ్లె..పద మనం ఏదైనా తినడానికి వెళ్దాము."
తను: "నాకు వద్దే ఇప్పుడే కుడితి తాగివచ్చా"(దాని భాషలొ కుడితి అంటే కాఫీ )
నేను: "అవునూ ..తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు..కొంపదీసి నేర్చుకున్నావా ఏంటి"
తను: "యా ..తెలుగు డబ్బింగ్ సినిమాలు,అడ్వర్టైజుమెంట్లు బాగా చూసి మరీ నేర్చుకున్నానే.."
నేను: "ఎంటి సినిమాలు చూసా!...సరే..నేనో పాట అడుగుతాను ఏ సినిమాలోదో చెప్పు..
రింగ రింగ...రింగ రింగ..రింగ రింగారే.."
తను: "ఆ మాత్రం తెలీదనుకున్నావా..శ్రీ కౄష్ణతులాభారం లోది"
నేను: "ఖర్మరా... దేవుడా"
ఓ రోజు మా ఊరికి వెళ్లవలసి వచ్చి,లొకల్ ట్రైన్ ఎక్కాలంటె ఏ ప్లాట్ ఫాం మీదకు వస్తుందో కనుక్కుందామని మా తింగిరికికాల్ చేసాను.తనూ..రెండో నెంబరు ప్లాట్ ఫాం దగ్గరకు ట్రైన్ వస్తుంది అని చెప్పి పెట్టెసింది.తను చెప్పినట్టుగానె 2వ ప్లాట్ఫాం పై వైట్ చేశాను.కానీ అందరూ 1వ ప్లాట్ ఫాం వైపుకు వెళ్తున్నారు.నాకు అప్పుడె ఎందుకొ డౌట్ వచ్చి, మళ్లి దానినిఅడిగాను..ఏమె ఫ్రెండ్ షిప్పుకు ఆ మాత్రం విలువ ఇవ్వవా..అని నన్ను తిట్టి, ఆ ప్లాట్ ఫాం దగ్గరే వైట్ చేపించింది.ఇంతలోట్రైన్ వచ్చేసరికి నేను ఎక్కేశాను.ఎప్పుడు పట్టిందొ నిద్రపట్టేసింది.తర్వాత కళ్లుతెరిచేసరికి ప్లాట్ ఫాం వచ్చేసింది.దిగి చూసిషాక్ అయ్యాను.ఎందుకంటె నేను ఉన్నది బీచ్ దగ్గర..రైల్వే స్టేషన్లొ కాదు..
ఆ తింగిరి దాన్ని తిడదామని కాల్ చేస్తె.."ఇప్పుదు అర్ధమైందా కుక్క సామెత" అని పెట్టెసింది.
(ఇదిగో కెమెరా మెన్..ఈసారి బొంగరం వైపుకు కాదయ్యా ..మస్కిటొ కాయిల్ వైపుకు తిప్పు...)
అలా చెన్నైలొ కొన్ని యుగాలు గడిచిన తరువాత...ఓ రొజు సడన్ గా తింగిరి నుండి కాల్ వచ్చింది.
తను: "హలో వీణా ..!ఆ రోజు నేను చేసిన దానికి సారీనే.."
నేను: "అబ్బా..నీకు ఇంత సంస్కారం ఎప్పుడు వచ్చిందో.."
తను: "మా ఇంట్లొ ట్రిపుల్ X సోపు వాడుతున్నప్పటినుండి.."
(అది ఆ రొజు ఎందుకు సారి చెప్పిందో నాకు ఆ తర్వాత గానీ అర్ధంకాలేదు).
హెచ్చరిక: ఇందుమూలముగా హైదరాబాదు పురప్రజలకు తెలియజేయడమేమనగా..ఈ తింగిరిది యుసఫ్ గూడా,ఎర్రగడ్డ పరిసర ప్రాంతాలలొ తిరుగుతున్నట్లు..తనని ఎవ్వరూ అడ్రసు అడగవద్దని..ప్రభుత్వం ఉత్తర్వ్యులుజారిచేసిందండహో..ఓఓఓఓఓఓఓఓఓఓ...! .." ..